Sushil Ji: నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
సుశిల్ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు.
సుశిల్ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు.
2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు గుప్పించింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.
అధికారం కోల్పొయి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ఉన్న జకియా ఖానం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది.
ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల అంశంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయొద్దని కోరారు. ఆదివాసులతో తనకు పేగు బంధం ఉందని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని RTV వేదికగా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా కులగణనకు ఆమోదం తెలిపింది. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.
రాముడు, హిందు దేవతలను 'పురాణాలు' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ గాంధీ 'రామ్ ద్రోహి' అంటూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సంచలన కామెంట్స్ చేశారు. హిందువులను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వామపక్ష తీవ్రవాదం, ఐఎస్ఐ కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు.
లైంగిక వేధింపులకు నేతలూ అతీతం కాదు. ఆడది అయితే చాలు ఎవరైనా లెక్క లేదు. కాల్స్, మెసేజెస్ తో తమ దూల తీర్చుకోవాల్సిందే. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలి పంకజ ముండేకు జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.