/rtv/media/media_files/2025/08/27/nandamuri-suhasini-2025-08-27-16-09-32.jpg)
Nandamuri Suhasini
Jubilee Hills Bypoll:
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. భర్త చనిపోయిన సింపతీతో పాటు కమ్మ, ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది కారు పార్టీ అధిష్టానం.ఇక గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికలో కైవసం చేసుకున్న కాంగ్రెస్..ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటును కూడా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య పోటీ పైన అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: హీరో విజయ్ దళపతిపై కేసు నమోదు
ఇదిలా ఉండగా బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేయాలని భావిస్తోంది. అయితే ఇక్కడ పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరు అన్న సందిగ్ధానికి తెరదించుతూ నందమూరి వారసురాలు అయిన నందమూరి సుహాసినిని బీజేపీ బరిలోకి దింపనుందన్న ప్రచారం సాగుతోంది. గతంలో కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుహాసిని ఆ తర్వాత పార్టీ కార్యకలపాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ పక్కన పెట్టడం, ఆయన కూడా టీడీపీ కి అంటిముట్టనట్లు ఉండటంతో సుహాసిని కూడ పార్టీకి దూరం అయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..
అయితే జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుహాసినిని పోటీలో నిలిపేందుకు గాను నందమూరి కూతురు బీజేపీ ఎంపీ పురందేశ్వరిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. పురందేశ్వరి సుహాసినితో ఇదివరకే సమావేశం అయినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మార్పుపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తెలంగాణలో టీడీపీ అంత బలంగా లేకపోవడం తో బీజేపీ ఆ స్థానంలో పోటీ చేసి టీడీపీ, జనసేన మద్ధతు కూడగట్టాలని భావిస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహిళా పోటీ చేస్తుండటం కూడా సుహాసినిని రంగంలోకి దించడానికి కారణం అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండటం, మాగంటి సునీత లాగే సుహాసిని కమ్మ సామాజికి వర్గానికి చెందినవారు కావడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
గతంలో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ రాష్ర్ట విభజన అనంతరం బీఆర్‌ఎస్ లో చేరారు. అయితే ఆ సమయంలో టీడీపీ ఓటుబ్యాంక్ అంతా ఆయన వైపే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు సుహాసిని ఇక్కడ పోటీ చేస్తే నందమూరి మీద ప్రేమ ఉన్న టీడీపీ ఓటర్లు కూడా ఆమెకు మద్ధతుగా నిలుస్తారని బీజేపీ భావిస్తోంది. మరో వైపు జూబ్లీహిల్స్‌లో కూడా కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్లు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నందమూరి సుహాసినిని బరిలోకి దింపితే కూటమి జూబ్లిహిల్స్‌లో మెరుగైన ఓట్లు సాధింస్తుందన్న భావనలో టీడీపీ ఉందట. ఆమెను ఎలాగైన ఒప్పించి టీడీపీ తరుపున పోటీ చేయించాలని స్థానిక టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అంతే కాకుండా టీడీపీ తెలంగాణలో రీఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట స్థానిక సైకిల్ పార్టీ నేతలు.
ఇది కూడా చూడండి:Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!