MLA Raja Singh : తెలంగాణ బీజేపీ నాయకత్వం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, కొంతమంది నేతల తీరువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హజరవుతానన్నారు. అయితే తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. అందుకే గతంలో కంటే తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడాలన్నా పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తనకు ఎవరూ బాస్‌లు లేరన్న రాజాసింగ్ ఇపుడు నన్ను ఎవరూ కట్టడి చేయలేరన్నారు. అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కూడా సభలో మాట్లాడే అవకాశం పార్టీ ఇచ్చేది కాదని ఆరోపించారు. ప్రస్తుతం సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. రాష్ర్ట బీజేపీ నాయకత్వం తీరుతో తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహారమేనని గుర్తు చేశారు. నాలాగే చాలా మంది పదవులు పోతాయని పార్టీలో జరుగుతున్న ఇబ్బందులపై నోరు విప్పడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. వాటిని కొంతమంది సర్వనాశనం చేశారంటూ బీజేపీ నేతలపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక బీజేపీలో చేరే విషయలోనూ రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తనకు తాను మళ్లీ బీజేపీలో చేరనని స్పష్టం చేశారు.. పార్టీ జాతీయ నాయకత్వం పిలిస్తేనే మళ్లీ పార్టీలో చేరుతానని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఒకవేళ వస్తే ఇక్కడ నెలకున్న ఇబ్బందులను వారికి వివరించిన తర్వాతే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానని వెల్లడించారు. లేకుంటే చచ్చినా.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లనని ఆయన సీరియస్‌గా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బీసీ బిల్లులపై అసెంబ్లీ సమావేశాలు అనేది కేవలం ప్రజల నుంచి దృష్టి మరల్చడానికేనని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని దమ్ముంటే సీబీఐకి అప్పచాలంటూ ప్రభుత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
కాగా, శనివారం నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ పరిశీలించారు.
ఇది కూడా చూడండి:Srisailam reservoir: శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు..అప్రమత్తమైన అధికారులు
MLA Raja Singh : బీజేపీలో చేరనే చేరను.. రాజాసింగ్ సంచలన కామెంట్స్..
తెలంగాణ బీజేపీ నాయకత్వం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, కొంతమంది నేతల తీరువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు.
MLA Raja Singh