/rtv/media/media_files/2025/07/26/pm-modi-2025-07-26-08-27-00.jpg)
PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th, Survey
వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎన్డీయే గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే గత ఎన్నికల్లో అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుంది ఎన్డీయే. అయితే ఇందులో బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 400 సీట్లు వస్తాయన్న ఎన్డీయే కూటమికి, మ్యాజిక్ ఫిగర్ 272 కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకో గలిగింది. కానీ తరువాత బీజేపీ తన మునుపటి పోజిషన్ కు వచ్చేసింది. ఫిబ్రవరిలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ లో కూడా ఎన్డీయే ఆధిక్యంలో ఉంది.
324 సీట్లు గ్యారంటీ..
ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది తర్వాత కూడా మోదీ ప్రభుత్వానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే దేశంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వమే కావాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే NDA ఆధిపత్య ప్రదర్శన చేసి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది . మరోవైపు కాంగ్రెస్ ఇంతకు ముందు కన్నా పడిపోయింది. 2024లో 234 సీట్లు గెలుచుకుని బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం పోటీ చేయలేదని చెబుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇండియా కూటమికి కేవలం 208 ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.
ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జూలై 1, ఆగస్టు 14, 2025 మధ్య నిర్వహించారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలలో 54,788 మంది దగ్గర నుంచీ అభిప్రాయాలను సేకరించారు. అదనంగా ట్రాకర్ డేటా ద్వారా 1,52,038 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. భారత్ లో జరుగుతున్న పరిణామాలు...అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మరింత మద్దతు పెరిగింది. మోదీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 260 సీట్లు గెలుచుకోగలదని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. అయితే గత ఫిబ్రవరిలో ఈ అంచనా 281 వరకు వచ్చింది. అప్పటితో చూస్తే ఇప్పుడు కాస్త తగ్గింది. ఈరోజు ఎన్నికలు జరిగితే NDA ఓట్ల వాటా 46.7%కి పెరుగుతుంది. 2024లో దానికి 44% ఓట్లు వచ్చాయి. ఇండియా బ్లాక్‌కు, సర్వే 40.9% ఓట్ల వాటాను అంచనా వేసింది.