అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

New Update
amit shah

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇంతకు ఏం జరిగిందంటే.. వెస్ట్ బెంగాల్‌లో అక్రమ చొరబాటుకు సంబంధించి ఎంపీ మంగళవారం సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : Karimnagar : ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!

అది ఎవరి తప్పు

నదియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాట్ల గురించి మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే చొరబాటుదారులు అని చెబుతున్నారు. ఒకవేళ సరిహద్దుల గుండా రోజూ లక్షల మంది మన దేశంలోకి చొరబడుతుంటే, అది ఎవరి తప్పు అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకవేళ దేశ సరిహద్దులను రక్షించడంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైతేముందుగా అమిత్ షా తల నరికి ప్రధాని నరేంద్ర మోదీ టేబుల్ మీద పెట్టాలంటూ ఆమె  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

ఇది కూడా చదవండి:మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

బీజేపీ తీవ్ర ఆగ్రహం

దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజా ప్రతినిధులను అవమానపరచడమేనంటూ ఖండించారు. మహువా వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని బీజేపీ విమర్శించింది. వెంటనే ఆమె తాను చేసిన కామెంట్స్ పై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పటికే పోలీసులకు పలువురు నేతల నుంచి పోలీసులకు  ఫిర్యాదులు కూడా అందాయి. కాగా మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై, అలాగే మాంసాహారంపై నిషేధం వంటి అంశాలపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

Also Read :   Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

Advertisment
తాజా కథనాలు