Patil Yatnal: హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే రూ.5 లక్షలు..
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ్ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మనదేశంలో కులాంతర, మతాంతర వివాహాలకు చాలావరకు కుటుంబ పెద్దలు అభ్యంతరం చెబుతుంటారు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంటాయి. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ్ పాటిల్ యత్నాల్(Patil Yatnal) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి(Hindu Muslim Marriage) చేసుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొప్పల్‌లో గవిసిద్దప్ప నాయక్ (26) వాల్మీకి సామాజికి వర్గానికి చెందిన యువకుడు ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు.
BJP MLA Patil Yatnal Comments On Hindu-Muslim Marriage
దీంతో కొంతమంది దండగులు ఓ మసీదు ముందు ఆ యువకుడిపై కత్తులు, ఇతర ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆగస్టు 3న చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అలాగే ప్రధాన నిందితుడు కూడా ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్ పరామర్శించారు. దీన్ని మతపరమైన హత్యగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ కుటుంబానికి పరిహారం అందించాలన్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ యువకులు ముస్లిం అమ్మాయిను వివాహం చేసుకుంటే రూ.5 లక్షలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రకటించారు. ఇందుకోసం తాను ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని తెలిపారు. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి ముస్లింలకు మాత్రమే ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని అన్నారు. కానీ హిందూ యువకులను రక్షించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు స్థానికంగా సంచలనం రేపాయి. పలువురు ముస్లింలు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేశారు.
ఖిద్మత్‌ఎమిల్లత్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కమర్ జునైద్ ఖురేషి ఆయన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ముస్లింలను రెచ్చగొట్టేలా, అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే యత్నాల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. పలువురు నెటిజన్లు బీజేపీ ఎమ్మెల్యేను సమర్థిస్తున్నారు. మరికొందరు ఖండిస్తున్నారు. కులాంతర, మతాంతర విహహాలను ప్రోత్సహించాలని మరికొందరు అవగాహన కల్పిస్తున్నారు.

Wedding

Also Read: దారుణం .. ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టారు.
BJP MLA Patil Yatnal Comments On Hindu-Muslim Marriage
దీంతో కొంతమంది దండగులు ఓ మసీదు ముందు ఆ యువకుడిపై కత్తులు, ఇతర ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆగస్టు 3న చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అలాగే ప్రధాన నిందితుడు కూడా ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్ పరామర్శించారు. దీన్ని మతపరమైన హత్యగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ కుటుంబానికి పరిహారం అందించాలన్నారు.
Also Read: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?
ఈ ఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ యువకులు ముస్లిం అమ్మాయిను వివాహం చేసుకుంటే రూ.5 లక్షలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రకటించారు. ఇందుకోసం తాను ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని తెలిపారు. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి ముస్లింలకు మాత్రమే ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని అన్నారు. కానీ హిందూ యువకులను రక్షించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు స్థానికంగా సంచలనం రేపాయి. పలువురు ముస్లింలు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేశారు.
Also Read: ఇండియా-పాక్‌లపై ఓ కన్నేసిన అమెరికా.. మార్కో రూబియోమ షాకింగ్ కామెంట్స్
ఖిద్మత్‌ఎమిల్లత్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కమర్ జునైద్ ఖురేషి ఆయన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ముస్లింలను రెచ్చగొట్టేలా, అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే యత్నాల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. పలువురు నెటిజన్లు బీజేపీ ఎమ్మెల్యేను సమర్థిస్తున్నారు. మరికొందరు ఖండిస్తున్నారు. కులాంతర, మతాంతర విహహాలను ప్రోత్సహించాలని మరికొందరు అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: రాధాకృష్ణన్ ర్యాలీపై బాంబుల వర్షం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా!?