Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై తాజాగా కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేశారు.