/rtv/media/media_files/2025/07/11/bjp-raja-singh-2025-07-11-13-40-37.jpg)
MLA Raja Singh:
బీజేపీ పార్టీలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా సంచలనంగా మారింది. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండికి ఓ ట్వీట్ చేశారు. జూలై 11న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం X వేదికగా MLA రాజాసింగ్.. బండి సంజయ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. గతంలో రాజాసింగ్ బండి సంజయ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ముగ్గురు నాయకుల కారణంగా ఆయన అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారని టాక్.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.@bandisanjay_bjppic.twitter.com/qodxNlP1Z9
— Raja Singh (@TigerRajaSingh) July 11, 2025
బీజేపీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేసినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కిషణ్ రెడ్డి, బండి సంజయ్‌లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా బర్త్ డే విషెస్ చేప్పడంతో ఆయన రాజీనామా రద్దు చేసుకుంటున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. బీజేపీ ఢిల్లీ నాయకులు తెలంగాణ నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే బండి సంజయ్‌తో ఆయనకున్న విభేదాలు తొలిగిపోయాయని అనుకుంటున్నారు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్