/rtv/media/media_files/2025/07/11/rajasingh-2025-07-11-14-52-31.jpg)
MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ(BJP) బిగ్ షాకిచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధిష్టానం ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామాను ఆమోదించడం పట్ల రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
11 ఏళ్ల క్రితం ఇదే రోజున
11 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్టీలో చేరానన్నారు రాజాసింగ్. ప్రజలకు, దేశానికి సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ తనను నమ్మి వరుసగా మూడుసార్లు టికెట్ ఇచ్చిందని, ఇన్నిరోజులు తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్న లక్షలాది మంది కార్యకర్తల కృషిని ఢిల్లీకి తెలియజేయడంలో తాను విఫలమయ్యానన్నారు. తాను పార్టీలో ఎలాంటి పదవి, అధికారాన్ని ఆశించలేదని.. వ్యక్తిగతంగా పేరు కోసం కూడా ప్రయత్నించలేదని వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వవాదం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. జైశ్రీరామ్ అంటూ ఎక్స్ వేదికగా రాజాసింగ్ తెలిపారు.
Also Read:వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి
आज से ठीक 11 साल पहले मैंने भारतीय जनता पार्टी की सदस्यता ली थी।
— Raja Singh (@TigerRajaSingh) July 11, 2025
जनता की सेवा, देश की सेवा और हिंदुत्व की रक्षा के उद्देश्य से मैंने भाजपा से जुड़ने का निर्णय लिया था।
भाजपा ने मुझ पर विश्वास करते हुए लगातार तीन बार तेलंगाना विधानसभा चुनाव में गोशामहल से विधायक पद का टिकट दिया।…
ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి రాజీనామా చేసినట్లే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాకుండా వేరే పార్టీలో చేరుతారా లేదంటే ఇండిపెండెంట్ గానే పదవిలో కొనసాగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు. యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
రాజాసింగ్ కు బీజేపీతో విభేదాలు కొత్తవి కావు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం, ఆ తర్వాత తిరిగి 2023 ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే తాజా పరిణామాలు మాత్రం తీవ్రంగా మారాయి.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్