TG Crime : మైనర్ బాలిక పై అత్యాచార యత్నం.. దేహశుద్ధి చేసి

ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది.  పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్‌ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు.

New Update
POCSO case

POCSO case

ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది.  పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్‌ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు.  

Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..


ఇర్ఫాన్‌ పాలకోసం వెళ్లిన సమయంలో ఆ ఇంటిలో ఆరోతరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో ఎవరూ లేరని భావించిన ఇర్ఫాన్‌ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆ బాలిక కేకలు వేయడంతో ఇంటివెనుక తోటలో పని చేసుకుంటున్న తల్లిదండ్రలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి రాకను గమనించిన ఇర్ఫాన్‌ పారిపోయే ప్రయత్నం చేశాడు.

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

అయితే చుట్టుపక్కల వారు గమనించి ఆ యువకుడుని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.అత్యాచార యత్నానికి పాల్పడిన ఇర్ఫాన్‌ కొత్తగూడెంలోని అల్లిపురానికి చెందిన వాడిగా గుర్తించారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు