BIG BREAKING: సింగరేణి ఎండీపై వేటు.. కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌..రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

సింగ‌రేణి సంస్థ సీఎండీగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్‌మెంట్ శాఖలో కార్యదర్శిగా సేవలందించిన జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది.

New Update
FotoJet (14)

singareni cmd

Singareni: సింగ‌రేణి సంస్థ సీఎండీ(CMD)గా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్‌మెంట్ (SCD) శాఖలో కార్యదర్శిగా సేవలందించిన డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది. సింగరేణి CMDగా ఫుల్ అడిషనల్ చార్జ్ నిర్వహిస్తున్న కృష్ణ భాస్కర్ ను ఆ బాధ్యతల నుంచి విడుదల చేశారు. డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ పరిపాలనా రంగంలో విస్తృత అనుభవం కలిగిన అధికారి. జిల్లా కలెక్టర్‌గా, ఎన్నికల విభాగంలో ఉన్నత బాధ్యతలు నిర్వ‌హించారు. రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాల్లో కీలక పదవుల్లో పనిచేశారు. వైద్య విద్యాభ్యాసం కలిగిన అధికారి అయినా, పరిపాలనా సేవల్లో సమర్థుడిగా గుర్తింపు పొందారు.

కొంత కాలంగా సింగరేణి సంస్థకు పూర్తి స్థాయి సీఎండీ లేకపోవడంతో పరిపాలన, బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం పడుతోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థకు పూర్తి స్థాయి CMDను నియమించడం ద్వారా, బొగ్గు ఉత్పత్తి, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్ణయాల్లో స్పష్టత, స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ను నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. టీజీఆర్ఏసీ డీజీగా సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవి నియమితులయ్యారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు కేటాయించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్‌ను నియమించారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురాం శర్మకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాం శర్మ కొనసాగనున్నారు.

Advertisment
తాజా కథనాలు