BIG BREAKING: కొత్తగూడెంలో బాంబుల కలకలం.. సీఎం పర్యటన తెల్లారే..!

భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది.

New Update
Dod dies in a bomb blasted in bhadradri kothagudem

Dod dies in a bomb blasted in bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారం మేరకు 3వ టౌన్ పోలీసులు, రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్స్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలిన బాంబు నాటు బాంబు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు