TG News: ఛీ.. వీడు తండ్రేనా.. కన్న కూతురుపై శాడిజం! కాలితో తన్నుతూ చిత్రహింసలు!

డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు!  కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.

New Update
bhadradri kothagudem

bhadradri kothagudem

TG News: డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు!  కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు. కన్న కూతురి పట్ల కర్కశత్వాన్ని వెళ్లగక్కాడు. మళ్ళీ కనీస మానవత్వం కూడా లేకుండా దాడి చేసిన వీడియోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకున్నాడు ఈ సైకో తండ్రి! ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో చోటుచేసుకుంది.

కసాయి తండ్రి 

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా సారపాక గ్రామంలో నివాసముంటున్న రమేష్ అనే వ్యక్తి  మద్యం మత్తులో ఇంటికొచ్చి కన్నకూతురిపై తన శాడిజాన్ని చూపించాడు. కన్న కూతురు అనే కనీస కనికరం లేకుండా కూతురిని కాలితో తన్ని, చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి రాక్షసత్వానికి భయంతో బెంబేలెత్తిపోయింది. డాడీ కొట్టొద్దని చెప్పినా వినకుండా.. కాలితో తన్నుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ కనీస మానవత్వం లేకుండా కూతురిపై దాడి చేస్తున్న వీడియోను రికార్డు చేసుకున్నాడు. ఆపై స్టేటస్ లో పెట్టుకున్నాడు ఈ సైకో తండ్రి. ఈ దుర్మార్గుడి వేధింపులు భరించలేకపోయిన ఆ బాలిక  చైల్డ్ హెల్ప్‌లైన్‌ 1098కు  ఫోన్ చేసి తన భాదను చెప్పుకుంది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు దీనిపై విచారణ చేశారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ సక్కుబాయి బాలికను కలిసి వివరాలు సేకరించారు. బాలిక తన తండ్రి తనపై దాడి చేశాడని అధికారులకు చెప్పడంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 

వెంటనే ఐసిడిఎస్ అధికారి సక్కుబాయి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో బాలిక తండ్రి పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బాలిక ధైర్యంగా ముందుకొచ్చి చైల్డ్ హెల్ప్ లైన్ ని సంప్రదించడాన్ని ప్రశంసించారు. ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లలు ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదు చేయాలని.. అప్పుడే వీటిని అరికట్టవచ్చని సూచించారు. 

Also Read: Bigg Boss: బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అక్కడ రొమాంటిక్ షూట్!

Advertisment
తాజా కథనాలు