/rtv/media/media_files/2025/07/28/charla-2025-07-28-14-31-48.jpg)
Maoists charla
Maoist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు వేసి కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చర్ల మండలంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో పాటు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితోపాటు దానవాయిపేటలోనూ మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అందులో డిమాండ్ చేశారు. కాగా మావోయిస్టుల కరపత్రాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.