CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీసీలకు రిజర్వేషన్ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు.