/rtv/media/media_files/2UtzhxtQDA7ndKKQQ8tb.jpg)
TG High Court
TG High Court: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నపుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టు సూచించింది. కోర్టులు జోక్యం చేసుకోకూడదు అంటే పదిరోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అభిప్రాయం తెలపడానికి కొంత సమయం ఇచ్చింది.
బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం జీవో తీసుకురావడంతో బీసీ కమిషన్, బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం బీసీలకు ఎంతో ఊతమందిస్తుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సన్నద్ధం అయ్యారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏ క్షణానైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరోసారి వాయిదా పడతాయా? అన్న చర్చలు మొదలయ్యాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించటం రాజ్యాంగవిరుద్ధమని పిటీషనర్ తన పిటీషన్లో ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదని గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును ఇఫుడు రేవంత్ సర్కార్ తుంగలోతొక్కిందని పిటీషనర్ ఆరోపించారు.
ఇది కూడా చూడండి: HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్!