/rtv/media/media_files/2025/04/28/QBSFRSWk0UqsDQV7koVB.jpg)
Telangana High Court
BIG BREAKING: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై మాధవరెడ్డి అనే వ్యక్తి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. దీనిపై హౌజ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా ఆయన పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిన్న ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితమే ఈ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు. అయితే.. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్‌ను విచారించలేమని హై కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పు అనంతరం జీవో విడుదల కావడంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్‌కు అనుమతి కోరారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ దీనిని పరిశీలిస్తున్నారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ మాధవరెడ్డి సెప్టెంబర్ 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాధవరెడ్డితో పాటు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేరొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను వెలువరించడాన్ని వారు వ్యతిరేకించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. ఆ సెక్షన్‌ను తొలగించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని వారు కోరారు. ఇప్పటికే జీవో విడుదల చేసినందున ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్ మలాజిగిరి, సిద్దిపేట కలెక్టర్లను పేరొన్నారు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..