/rtv/media/media_files/2025/01/22/fFudwVwTuK7mXJNSBWu1.jpg)
Telangana High Court
TG High Court: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావించిన ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా ఈ విషయమై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, కోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని ఆయన కోరారు. ప్రభుత్వ వాదన అలా ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి దీంతో కేసు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది.
 Follow Us