/rtv/media/media_files/2025/03/24/Hykok2kv4qzuZIEoqnit.jpg)
Telangana High Court
BIG BREAKING: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేష్ల అంశం నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. వాస్తవానికి ఇవాళ ఉదయం 10.30కి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. న్యాయమూర్తుల ఎదుట బీసీ రిజర్వేషన్ పిటిషన్‌ను న్యాయవాదులు మెన్షన్ చేశారు. అదే సమయంలో బీసీ రీజర్వేషన్ బిల్ రద్దు చేయాలనీ మరో రెండు పిటిషన్ లు వచ్చాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ లో పిటిషనర్స్ మెన్షన్ చేశారు.
ఈ సందర్భంగా గతంలో స్పెషల్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలనీ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని సీజే ప్రశ్నించారు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది.సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ధర్మాసనం వారిని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు లో పిటిషన్ వేశారని డీస్ మిస్ చేసిందని కోర్టు కు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది. మధ్యాహ్నం అన్ని పిటిషన్ లు కలిపి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. తిరిగి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.
BC రిజర్వేషన్లపై పదుల సంఖ్యలో ఇంప్లీడ్ పిటిషన్లు రావడంతో అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించనుంది. దీంతో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభావం చూపనుంది. జీవో 9ని హైకోర్టు సమర్థిస్తుందా... కొట్టవేస్తుందా,..? అనేది నేడు తేలనుంది. హైకోర్టు జీఓ జోలికి వెళ్లకుంటే యధాతధంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జీఓను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.