BIG BREAKING: కల్వకుంట్ల కాదు, కలవకుండా చేసి ఫ్యామిలీ.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలనం
సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేదుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. ఆరు నూరైనా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ఆదివారం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేదుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. ఆరు నూరైనా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి పేరు కల్వకుంట్ల కాదు.. కల్వకుండా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎవరినీ కలవకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీసీలు ఓసీలు కల్వకూడదు.. ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు.. హిందువులు, మైనార్టీలు కల్వకూడదు.. అనే సిద్ధాంతాలను కేసీఆర్ పాటిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావొచ్చుని సూచించారు.
లాబీయింగ్ చేసి బిల్లు గవర్నర్‌కు పంపాలా?
తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ భావిస్తున్నారన ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్‌లో పెట్టారు. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దంటూ చట్టం తెచ్చింది. అది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయని రేవంత్ రెడ్డి అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ చట్టంగా మారుతుంటే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌లు బాధపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. బిల్లు గవర్నర్‌కు పంపాము.. గత సీఎం(కేసీఆర్), గరర్నర్ సన్నిహిత్యంతో బిల్లు ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల లాబియింగ్ చేసి బీసీ రిజర్వేషన్ గవర్నర్, కేంద్రానికి పంపాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Cm revanth reddy assembly Photograph: (Cm revanth reddy assembly)

.