Telangana local body elections:  తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
Telangana Local body elections

Telangana Local body elections

Telangana local body elections :  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని తేలింది. ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో మరింత గడువు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ నెల30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహిస్తామని.. ప్రభుత్వం చెబుతున్నా మరింత లేట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది.

 దీంతో  స్థానిక సంస్థల ఎన్నికలు మ రింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్‌ తేలడానికి సమయం పడితే నవంబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్‌ల ప్రక్రియ అమలు ఆలస్యం కానుండడంతో త మకు మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం అభ్యర్థించినునట్లుగా తెలిసింది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లను అమలు చేయాలని భావించిన రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించుకొని రాష్ట్రపతికి పంపించగా ప్రస్తుతం ఢిల్లీలో ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది. దీ నిపై పలుమార్లు ఢిల్లీకి సీఎం, మంత్రులు, ఎంపీలు వెళ్లినా, ధర్నా చేసినా ఇప్పటివరకు దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.  అయితే హై కోర్టు ఇచ్చిన సమయం ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉండడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది.  గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్‌లు మించకుండా తెచ్చిన చట్టాలకు సవరణ చేసింది. అందులో పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285(ఏ), మున్సిపల్ చట్టం 2019 లోని సెక్షన్ 29కు సవరణలు చేసింది.  ప్రభుత్వం ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆ మోదించుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే, ఈ బిల్లులు కూడా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన వాటిని రాష్ర్టపతికి పంపే అవకాశం ఉంది. రాష్ర్టపతి నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

ఒకవేళ ప్రభుత్వం సవరణలు చేసిన రెం డు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినా పంచాయతీరాజ్ శా ఖ, మున్సిపల్ శాఖలు అతి తక్కువ సమయంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఇబ్బందిగా మారుతుందని, అందులో భాగంగానే తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. దీంతోపాటు త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అనంతరం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో జోష్ పెరుగుతుందని అది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆలోచిస్తుంది.

 దీనికోసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమయం ఇవ్వమని ప్రభుత్వం కోర్టును అభ్యర్థించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. స్థానిక సం స్థల ఎన్నికల ఆలస్యానికి కారణాలను ఈ లేఖలో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.కోర్టు ఇచ్చే అనుమతిపై ప్రభుత్వం ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: National Guards: షికాగో చాలా ప్రమాదకరంగా ఉంది..రక్షణ అవసరం..ట్రంప్

Advertisment
తాజా కథనాలు