BC Reservations :  బీసీ రిజర్వేషన్లపై హై కోర్టు లో వాడివేడిగా వాదనలు...అసలేం జరగబోతుంది?

తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ తరుపున లాయర వివేక్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు.

New Update
High Court

Telangana High Court

BC Reservations :  తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. పిటిషనర్ తరుపున లాయర వివేక్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే గత విచారణలో బీసీ బిల్లుపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు.. తాజాగా ఎలాంటి తీర్పు ఇస్తుందనేది రాష్ట్రవ్యాప్తంగా  ఉత్కంఠ రేపుతోంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆయనతో పాటు మరికొందరు పిటిషన్ వేయడంతో హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించడంతో రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. పంచాయితీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ‘ఏ’ కు ఇది విరుద్దమని పిటిషనర్ మాధవరెడ్డి తరపు న్యాయవాదులు గత విచారణలో హైకోర్టులో వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతానికి మించినట్టు హైకోర్టు ప్రస్తావించింది. అదే సమయంలో బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరకు ఎప్పుడు వెళ్లిందని ఏజీని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నపుడు జీవో ఎలా ఇచ్చారంది. దీనిపై ఏజీ వాదనలు వినిపించి అసెంబ్లీ తీర్మానం చేసిందని.. స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని తెలిపారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ప్రశ్నించారు. లాయర్లు ప్రభుత్వం జీవోని, కొత్త రిజర్వేషన్ల షెడ్యూల్ ఇప్పటికే విడుదలై ఉన్నదని హైకోర్టుకు వివరించారు. అలాగే, సుప్రీంకోర్టు ఈ విషయంపై ఇప్పటికే కొన్ని అంశాలను తిరస్కరించిందని కూడా లాయర్లు ప్రస్తావించారు.

బీసీ రిజర్వేషన్‌ బిల్లు పై హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్‌ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ర్ట ప్రభుత్వానిదే అని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన గుర్తు చేశారు.  నాలుగు అంశాల ఆధారంగా జీవో 9ను సవాల్‌ చేస్తున్నామని పిటిషనర్‌ తరుపున న్యాయవాది వాదించారు.అసెంబ్లీలో బిల్లు పాస్‌ అయ్యిందా అని న్యాయమూర్తి అడిగారు. బిల్లు పాసైంది కానీ, చట్టంగా మారలేదని న్యాయవాది వాదించారు. బిల్లు గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతానికి పెరిగితే ఎన్నికలకు వెళ్లోద్ధన్న నిబంధన ఉందని న్యాయవాది గుర్తు చేశారు. ఎస్టీలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో షెడ్యూల్‌ ఏరియాల్లో రిజర్వేషన్లు పెంచుకునే వీలుంది. అని న్యాయవాది  వాదించారు.  రిజర్వేషన్‌ పెంపు బిల్లు ఎప్పుడు పాస్‌ అయిందని హైకోర్టు ప్రశ్నించింది. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని మరో పిటిషనర్‌ గుర్తు చేశారు.

రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్‌ టెస్టును రాష్ర్ట ప్రభుత్వం అనుసరించాలని సుప్రీం కోర్టు చెప్పిందని న్యాయవాది వాదించారు. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాతే రిజర్వేషన్లు పెంచవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి.  ట్రిపుల్‌ టెస్టులో భాగంగా డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్టును కూడా బహిర్గతం చేయలేదని పిటిషనర్‌ తరుపున న్యాయవాది వివేక్‌ రెడ్డి వాదించారు. ఎంపిరికల్‌ డేటా కూడా సమగ్రంగా లేదని వివేక్‌ రెడ్డి అబిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదని లాయర్‌ గుర్తు చేశారు. రాజ్యంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలు నిలిపివేయాలని కోరడం లేదని రిజర్వేషన్ల పెంపుపై శాస్ర్తీయ ఆధారాలను ప్రభుత్వం ప్రచురించలేదన్నారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

Advertisment
తాజా కథనాలు