/rtv/media/media_files/2026/02/10/fotojet-8-2026-02-10-20-18-47.jpg)
Indiramma's house
Indiramma's house :తెలంగాణలో ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ త్వరలోనే పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదలు లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాక ఇన్నాళ్లు స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఇంటి స్థలం లేకున్నా ఇల్లు ఇస్తామని తెలిపింది.
స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామన్న మంత్రి ,స్థలం లేని వారికి జీ ప్లస్ టు తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్ట పడుతుందన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు 2025- 26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇళ్లలో 53శాతం వరకు ఇప్పటివరకు పురోగతి సాధించాయి. ఇంకా 47శాతం ఇళ్ళ పనులు పూర్తి కావలసి ఉందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళను కేటాయిస్తున్నామన్నారు. అయితే 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,69,014ఇళ్ళను కేటాయించగా ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.
మిగిలిన ఇళ్లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 4000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిధులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్నారు. నిధులు విడుదల అవుతున్నప్పటికీ చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక కొరత ఉండడం, ఇటుక, ఐరన్, సిమెంట్ ధరలు బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు, ఇక స్థలం లేని వారికి జి ప్లస్ 2 చొప్పున ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Follow Us