/rtv/media/media_files/2026/01/18/cm-revanth-2026-01-18-15-56-26.jpg)
CM Revanth
ఇటీవల తెలంగాణ మంత్రికి ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధం ఉన్నట్లు ఎన్టీవీలో కథనం ప్రసారం చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో మీడియా సంస్థలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(batti-vikramarka) ను టార్గెట్ చేస్తూ కథనాన్ని ప్రచురించారు. ఈ వివాదాలపై తాజాగా సీఎం రేవంత్(CM Revanth Reddy) స్పందించారు. మా మంత్రులను బద్నాం చేయొద్దని.. వారిపై వార్తలు రాసేముందు నా వివరణ అడగండని సూచించారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. అక్కడ రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Also Read: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
CM Revanth Responds On Ministers Rumors
అనంతరం సభలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' గతంలో ఎన్డీఆర్ రూ.2 కిలో బియ్యం ప్రవేశపెట్టారు. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ సారథ్యంలో ఫ్రీగా సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు కావాలంటే ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వంలో లక్షలాది రేషన్‌కార్డులకు పేదలకు అందించాం. గతంలో వైఎస్సార్ ఫ్రీ విద్యుత్‌పై మొదటి సంతకం చేశారు. ఇప్పుడు మేము పేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదవాడిపై కుట్ర చేసి ఇళ్లు ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందిస్తోంది. మేము అధికారంలోకి వచ్చాక మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.
సింగరేణికి సంబంధించిన విషయంలో కొందరు ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. స్కామ్‌లు జరిగినట్లు. సింగరేణి బొగ్గు మాయమైనట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవాళ్లకే అప్పగిస్తాం. ఇందులో అవినీతికి చోటునివ్వం. రెండేళ్ల తమ పాలనలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వలేదు. భద్రాచలానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు.
Also Read: మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?
మా ప్రభుత్వంలో భద్రాచలంలో భూసేకరణ చేస్తున్నాం. అయోధ్యలాగా ఆ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మిస్తాం. మాపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బీఆర్‌ఎస్ బలపడేలా చేయకండి. మీడియా వాళ్ల మధ్య గొడవలుంటే తలుపులు ముసుకొని గొడవ పడండి. మా మంత్రులను మాత్రం బద్నాం చేయకండి. మంత్రులపై వార్తలు రాసే ముందు నన్ను వివరణ అడగండి. మీడియాకు వివరణ ఇవ్వడం కోసం నేను ఎల్లప్పుడు రెడీగా ఉంటా. మా మంత్రులపై అసత్య వార్తలు వస్తే నా గౌరవానికి భంగం ఏర్పడుతుంది. మంత్రులందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని'' సీఎం రేవంత్ అన్నారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in a meeting with public representatives in Khammam District. https://t.co/Io65niQhwb
— Revanth Reddy (@revanth_anumula) January 18, 2026
Follow Us