Deputy CM: భట్టి విక్రమార్క సంచలనం.. హరీశ్ రావు అడిగితే చాలు చేయిస్తా!

రాధాకృష్ణ రాసిన తొలిపలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. "కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. చిల్లర పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

New Update
Bhatti Vikramarka

Deputy CM

Deputy CM: సింగరేణి సంస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా తనపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. శనివారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ABN రాధాకృష్ణ ప్రచురించిన కథనాలు కేవలం కట్టుకథలని, విషపు రాతలని మండిపడ్డారు.

Also Read: మేడారం.. భక్తజన గుడారం.. ఒక్కరోజే 3 లక్షలమంది దర్శనం

రాధాకృష్ణ రాసిన ఎడిటోరియల్ కాలమ్‌ తొలిపలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. "కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. పెట్టుబడులు- కట్టుకథల పేరుతో విషం చిమ్మడం ద్వారా రాష్ట్రానికి, సింగరేణికి తీరని నష్టం చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నత ఆశయాలతో పనిచేశానని, ఇలాంటి చిల్లర పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

Also Read: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..

టెండర్ల నిబంధనలపై క్లారిటీ

సింగరేణి టెండర్లలో 'సైట్ విజిట్' తప్పనిసరి అనే నిబంధన కొత్తది కాదని భట్టి వివరించారు. కేంద్ర ప్రభుత్వమే ఈ నిబంధనను 2018లో ప్రవేశపెట్టింది. 2021లో కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలోనూ సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. NMDC, హిందూస్తాన్ కాపర్స్, GICPL వంటి సంస్థలతో పాటు మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయని ఆధారాలతో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఈ నిబంధనలు ఉన్నాయని, తాము కేవలం పాత పద్ధతినే అనుసరిస్తున్నామని చెప్పారు.

నైనీ కోల్ బ్లాక్ ఆరోపణలపై ధ్వజం

నైనీ కోల్ బ్లాక్ టెండర్లను సీఎం బావమరిది సృజన్ రెడ్డికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. "నైనీ కోల్ బ్లాక్‌లోని 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ హయాంలోనే పిలిచారు. సృజన్ రెడ్డి భార్య దీప్తి రెడ్డి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె. బీఆర్ఎస్ నాయకుడి అల్లుడిని సీఎంతో ఎలా ముడిపెడతారు?" అని ప్రశ్నించారు.

Also Read: అమెరికాను వణికిస్తున్న మంచుతుపాన్‌ ..డేంజర్ లో 16 కోట్ల మంది

ప్రతిపక్షాలకు విచారణ సవాల్

సింగరేణి ఆస్తులపై రాబందులు వాలనివ్వబోనని ప్రతిజ్ఞ చేసిన భట్టి, విచారణకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. "హరీష్ రావు, మీరు సీనియర్ మంత్రిగా పనిచేశారు. మీకు ఏం కావాలో చెప్పండి. కేవలం లేఖ రాస్తే చాలు.. 2014 నుంచి సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లపై, ముఖ్యంగా తాడిచర్ల OB కాంట్రాక్టుపై SIT లేదా ఇతర సంస్థలతో విచారణ చేయిస్తాం." కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణను కూడా తాను స్వాగతిస్తున్నానని, అసలు నిజాలు బయటకు రావాలని ఆయన కోరారు. రాధాకృష్ణ తన తప్పుడు కథనాలకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు