Nagoba Jatara: 250 మంది కొత్త కోడళ్లు.. తెల్లని వస్త్రాలు.. అర్ధరాత్రి వేళ  అపూర్వం

మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పుష్య అమావాస్య రోజున మహాపూజ, భేటింగ్ తంతు నిర్వహించి కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు.

New Update
FotoJet - 2026-01-22T105239.354

Nagoba Jatara

Nagoba Jatara:  : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ రోజు సైతం వందలాది మంది నాగోబాను దర్శించుకున్నారు. గంటల తరబడి బారులు తీరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా దర్శనం చేసుకున్నారు.వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా రావడంతో ఆలయంతో పాటు జాతరలో ఎటుచుసినా భక్తుల రద్దీ కనిపించింది. యువతీయువకులతో రంగుల రాట్నాల వద్ద సందడి నెలకొంది. జాతరకు తరలివచ్చిన ప్రజలు జాతరలో వెలిసిన దుకాణలో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తూ సందడిగా గడిపారు.

 250 మంది కొత్త కోడళ్లతో భేటింగ్‌ 
 
నాగోబా జాతరలో భాగంగా మెస్రం వంశ గిరిజనులు తమ ఆచారం ప్రకారం ఒక్కో తంతును పూర్తి చేస్తున్నారు.  మెస్రం వంశ గిరిజనులు పుష్య అమావాస్య రోజున మహాపూజ, భేటింగ్ తంతు నిర్వహించి కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు.  ఇందులో ఆనవాయితీ ప్రకారం నిర్వహించిన మరో తంతు భేటింగ్ చూడ ముచ్చటగా కొనసాగింది. మహాపూజ అనంతరం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఈ తంతు కొనసాగింది. ఈ సంవత్సరం 250 మంది కొత్త కోడల్లు భేటింగ్ లో పాల్గొన్నారు. తెల్లని వస్త్రాలను ధరించి పెద్దల సహకారంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు భేటింగ్ నిర్వహించారు. తమ ఇంటి కొత్త కోడళ్ళను కుటుంబ పెద్దలు తమ దైవాలకు పరిచయం చేసే కార్యాన్నే భేటింగ్ అని పిలుస్తారు.

FotoJet - 2026-01-22T105305.104

ఇలా ఆలయంలో పెద్దల సమక్షంలో కొత్త కోడళ్లను పరిచేసుకున్న తర్వాతే వారు మెస్రం వంశంలో చేరినట్లని చెబుతారు. ఇలా భేటింగ్ జరిగితేనే ఆలయ  ప్రవేశం, దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. భేటింగ్ జరిగేంత వరకు ఆలయ ప్రవేశం గాని,  దైవ దర్శనం గాని ఉండదు. ఒకవేళ ఎవరికైన భేటింగ్ లో పాల్గొనే వీలు కాకపోతే వారు మళ్లీ వచ్చే సంవత్సరం నిర్వహించే భేటింగ్ వరకు వేచి ఉండాల్సిందే. కొత్తగా పెళ్లై అత్తారింటికి వచ్చిన వారు అయినా సరే, మధ్య వయసు వారైన సరే భేటింగ్ జరిగేంత వరకు వారిని కొత్త కోడళ్లుగానే పరిగణిస్తారు. ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారమని, దీన్ని కట్టుతప్పకుండా ఆచరిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఇలా భేటింగ్ జరిగితే ఆ ఇంటి కొత్త కోడళ్ళు ఇతర దేవతలను చూడగలుగుతారని అంటున్నారు.

222

జాతరలో మంత్రుల సందడి

కేస్లాపూర్ లో కొలువున్న గిరిజనుల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. జాతర సందర్భంగా ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న గిరిజనులతోపాటు గిరిజనేతరులు నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతరలో భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఆలయ అభివృద్ధికి నిధుల హామీ ఇచ్చారు. యంగ్ ఇండియా స్కూల్, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. జాతర మొదలైన మూడవరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. నాగోబా తోపాటు సత్తి దేవతలను దర్శించుకున్నారు. ప్రత్యేకంగా నాగోబాకు పూజలు చేశారు.

01KNP136-340041_1_44.jpg

ఆలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మెస్రం వంశీయులు సంప్రదాయబద్దంగా సత్కరించారు. నాగోబా చిత్రపటాన్ని బహుకరించారు. తీర్ద ప్రసాదాలను అందజేశారు. వీరితోపాటు ఎమ్మెల్సీ దండె విఠల్, శాసన సభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ తదితరులు ఉన్నారు. నాగోబా దర్శన అనంతరం డిప్యూటి సిఎం ఆలయ మండపంలో కొద్దిసేపు కూర్చోని మెస్రం వంశ పెద్దలతో ముచ్చటించారు. నాగోబా గురించి, ఆలయ విశిష్టత గురించి మెస్రం వంశ గిరిజన పెద్దలు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే వివిధ క్రతువుల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటి సిఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాగోబా జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని అన్నారు. ఈ పురాతన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.

b3b0a680-9a3b-11ed-bc5f-d3f6514444a2.jpg

Advertisment
తాజా కథనాలు