Sabarmati Jail : హైదరాబాద్ ఉగ్రవాది మోహియుద్దీన్ సయ్యద్‌పై జైల్లో దాడి

హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్‌పై దాడి జరిగింది.  సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.

New Update
accused

హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్‌పై దాడి జరిగింది.  సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.   కళ్ళు, ముక్కుపై గుద్దడంతో గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో నిలేష్ శర్మ అనే ఖైదీ ముఖ్యుడిగా గుర్తించారు. వెంటనే అతన్ని అహ్మదాబాద్‌ సివిల్ ఆసుపత్రికి తరలించారు.  దేశవ్యాప్తంగా రిసిన్ అనే రసాయనంతో.. లక్షల మంది ప్రాణాలు తీసేందుకు మోమియుద్దీన్ కుట్ర చేశాడు. 

చైనాలో MBBS

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్‌తో పాటు దేశవ్యాప్తంగా 9 మంది ఉగ్రమాడ్యూల్స్ అరెస్టు అయ్యారు. కాగా అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందినవాడు. చైనాలో MBBS చదివాడు. కొన్ని సంవత్సరాలు దుబాయ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇతను వివిధ టెలిగ్రామ్ గ్రూపుల్లో చురుకుగా ఉంటూ, విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాడులకు అవసరమైన పదార్థాలను సేకరించి, సరైన పద్ధతిలో రిసిన్‌ను తయారు చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

మోహియుద్దీన్ ని ఉగ్రవాద కుట్ర కేసు నిందితుడిగా గుర్తించిన తోటి ఖైదీలు, తమ దేశభక్తిని ప్రదర్శించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడికి పాల్పడినట్లుగా జైలు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ సంఘటనపై జైలు అధికారులు అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై రాణిప్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు