/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t173817521-2025-11-15-17-38-49.jpg)
High tension in Hindupur..attack on YCP office..tense
AP: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను వైసీపీ విడుదల చేసింది. ఈ వీడియోలో కొందరు వైసీపీ కార్యాలయంలోకి ప్రవేశించి ఒక్కసారిగా దాడికి దిగినట్లు కనిపిస్తోంది.
హిందూపురంలో శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. అయితే వారిని టీడీపీ నాయకులుగా వైసీపీ పేర్కొంది. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. టీడీపీ వారిని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వాళ్లపైనా దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది.
కాగా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Follow Us