lawrence bishnoi: పంజాబ్ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు..మాదే బాధ్యత అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

కెనడాలోని ప్రముఖ పంజాబీ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తామే బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. సర్దార్ ఖేడాతో చన్నీకు ఉన్న స్నేహం కారణంగానే కాల్పులని చెప్పింది.

New Update
channi

కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాజాగా ఆ దేశంలో ఉంటున్న భారతీయ వ్యాపార వేత్తను చంపిన ఇదే గ్యాంగ్ ప్రముఖ పంజాబ్ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కూడా కాల్పులు జరిపింది. దీంతో పంజాబ్ సంగీత పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చన్నీ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ పలుమార్లు కాల్పులు జరిపింది. అయితే ఈ దాడి నుంచి చన్నీ, అతని కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుండగులు కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

మేమే చేశాం..ఖేడాతో సంబంధాలు వద్దు..

చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు మేమే చేశామని లారెన్స్ బిష్ఱోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సింగర్ తో తమకు ఎటువంటి వివాదాలు లేవని.. కానీ సర్దార్ ఖేడాతో అతనికి సంబంధాలున్నాయని.. అందుకే కాల్పులు జరిపామని చెప్పింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేసింది. సోషల్ మీడియా పోస్ట్‌లో, ముఠాలో కీలక పాత్రధారి అయిన గోల్డీ థిల్లాన్ మాట్లాడారు. చన్నీ తమ శత్రువు అయిన సర్దార్ ఖేడాకు దగ్గర అవుతున్నాడని..వారిద్దరి మధ్యనా స్నేహం ఎక్కువ అవుతున్న కారణంగా..కాల్పులతో వార్నింగ్ ఇచ్చామని అన్నాడు. దీంతో పాటూ ఖేరాకు కూడా సందేశం పంపుతున్నామని తెలిపాడు. భవిష్యత్తులో కూడా  సర్దార్ ఖేడాతో పనిచేసే లేదా స్నేహం చేసే ఏ గాయకుడైనా వారి నష్టాలకు తామే బాధ్యత వహిస్తారని గోల్డీ మొత్తం పంజాబీ సంగీత పరిశ్రమను సవాలు చేసి బెదిరించాడు. మేము ఖేడాకు హాని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశాడు గోల్డీ థిల్లాన్. 

Also Read: Cloud Seeding: బోలెడు ఖర్చు పెట్టి ఢిల్లీలో మేఘమథనం..చుక్క కూడా పడని వాన