Ashwini Vaishnaw: 45 పైసలకే ప్రమాద బీమా, ఐదేళ్లలో రూ.27.22 కోట్లు చెల్లించాం.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే బీమా సదుపాయంపై కీలక ప్రకటన చేశారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకం కింద 5 ఏళ్లలో 333 బీమా క్లెయిమ్లు పరిష్కరించామని తెలిపారు. బాధిత ప్రయాణికులు లేదా వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.27.22 కోట్లు చెల్లించామన్నారు.