/rtv/media/media_files/2025/08/06/ashwini-vaishnaw-2025-08-06-18-44-32.jpg)
Railway passengers with e-ticket can avail travel insurance at 45 paisa only, says Vaishnaw
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini-vaishnaw) కీలక ప్రకటన చేశారు. రైలు టికెట్ బుకింగ్(Railway Ticket Booking) చేసుకునే ప్రయాణికుల కోసం కేవలం 45 పైసల ప్రీమియంతోనే బీమా సదుపాయం పొందొచ్చని తెలిపారు. పార్లమెంట్‌లో రైల్వే బీమా సదుపాయానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం అందించారు. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్ దగ్గర తీసుకునే టికెట్‌లో ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు.
అయితే ఈ బీమా స్కీమ్ ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకన్నుటువంటి కన్ఫర్మ్‌డ్/RAC ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ బీమా ప్రయోజనం పొందాలనుకుంటే ప్రయాణికులు టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్‌ను స్వయంగా ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు ఈ స్కీమ్‌ను ఎంచుకున్న వాళ్లకు అదనపు బీమా కవరేజ్ వస్తుందని.. ప్రీమియంగా కేవలం 45 పైసలు మాత్రమే తీసుకుంటారన్నారు. దీన్ని టికెట్ ధరతో పాటే చెల్లించాలని తెలిపారు.
Also Read : నెలకు రూ.60 వేల జీతంతో SBIలో క్లర్క్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!
Railway Passengers Awail Travel Insurance
ప్రయాణికులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకీ బీమా పాలసీ వివరాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ పాలసీకి సంబంధించి నామినీ వివరాలు రిజిస్టర్ చేసుకునే లింక్ కూడా మెసేజ్ వస్తుందన్నారు. బీమా పాలసీ జారీ, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి సదరు బీమా సంస్థే పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ బీమా సంస్థ, ప్రయాణికుల మధ్యే జరుగుతుందని చెప్పారు. అంతేకాదు ఈ బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో దాని వివరాలు ఆ సంస్థ పంపించిన మెయిల్‌లో ఉంటాయన్నారు.
Also Read: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
అయితే ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్(irctc-travel-insurance) పథకం కింద 5 ఏళ్లలో 333 బీమా క్లెయిమ్‌లు పరిష్కరించామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బాధిత ప్రయాణికులు లేదా వాళ్ల కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు మొత్తం రూ.27.22 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందడం కోసమే ఈ బీమా స్కీమ్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. 45 పైసలకే ఈ బీమా సదుపాయం ఉండటంతో ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ టిక్ బాక్సును ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవాల్సిన పనిలేదన్నారు. ఆ ఆప్షన్ డీఫాల్డ్‌గా వచ్చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఈ ప్రయోజనాలు ఎవరైనా వద్దనుకుంటే ఆ టిక్ మార్క్‌ను తీసివేయొచ్చని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి అదనపు పత్రాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read: లవర్‌తో పానీపూరి తిన్న చెల్లి.. జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన అన్నయ్య- షాకింగ్ వీడియో