Ashwini Vaishnav: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 2 గంటలే ప్రయాణం.. అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. హైస్పీడ్‌ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడ్జెట్‌లో భాగంగా తెలంగాణ రైల్వేకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

New Update
Ashwini Vaishnav

Ashwini Vaishnav

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini-vaishnaw) కీలక ప్రకటన చేశారు. హైస్పీడ్‌ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడ్జెట్‌(Budget 2026) లో భాగంగా తెలంగాణ రైల్వేకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ హైస్పీడ్‌ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ ఛేంజర్‌గా మారుతాయన్నారు. హైదరాబాద్ నుంచి  చెన్నై, పుణె, బెంగళూరుకు 3 హైస్పీడ్‌ రైళ్లు రానున్నాయని తెలిపారు.

Also Read: లోక్‌సభలో సరిహద్దు వివాదంపై రగడ.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

Hyderabad To Bangalore Travel Time In 2 Hours

ఈ హైస్పీడ్ రైలులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే వెళ్లొచ్చని తెలిపారు. పుణెకు 1.55 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదిలాఉండగా  కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వీటిలో మూడు కారిడర్లు హైదరాబాద్‌ మీదుగానే వెళ్లనున్నాయి. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్ల గురించి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇందులో రెండు కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌ మీదుగానే వెళ్లనున్నాయి. 

Also Read: తెలంగాణకు నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌..రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు నిల్‌

Advertisment
తాజా కథనాలు