/rtv/media/media_files/2025/03/19/r8NXedd2Ae7mBHc45Hkb.jpg)
Ashwini Vaishnaw Says Hyperloop at nascent stage
హైపర్‌లూప్ టెక్నాలజీపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా రంగంలో హైపర్‌లూప్ టెక్నాలజీ ఇప్పడే అభివృద్ధి చెందుతోందని తెలిపారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. హైపర్‌లూప్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. సాంకేతిక, భద్రతాపరమైన ప్రమాణాలను అంతర్జాతీయంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇది ఇతర రవాణా వ్యవస్థల కంటే వేగంగా పనిచేస్తోందని అంచనావేస్తున్నారు.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మిస్టరీ మరణాల కేసు.. ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
హైపర్‌లూప్ టెక్నాలజీలో ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్ట్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందంపై (MoU)పై సంతకం చేసింది. దీనికోసం రూ.20.89 కోట్ల నిధులను కేటాయిచామని'' కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదిలాఉండగా హైపర్‌లూప్‌ను అయిదో రవాణా విధానంగా చెబుతారు. సుదూర ప్రాంతాలకు అతివేగంగా చేరవేసే హైస్పీడ్ రవాణా వ్యవస్థే హైపర్‌లూప్.
Also Read: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్‌కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్
హైపర్‌లూప్‌లో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. రైలు బోగీలు పోలిన పాడ్‌లు ప్రయాణిస్తాయి. ఇందులో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను వినియోగిస్తారు. దీనివల్ల పాడ్‌ల దిగువ భాగం పట్టాలను తాకకుండానే దాదాపు అంగుళం మేర గాల్లోనే ఎగురుతుంటాయి. అలాగే ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపుగా ఉండదు. కాబట్టి రాపిడి, వాయి నిరోధకత లాంటివి జరగదు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని ఈ పాడ్‌లు అందుకుంటాయని నిపుణులు అంటున్నారు.
Also Read: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన.. మళ్లీ నడవాలంటే అది తప్పదా ?
Also Read: ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్