/rtv/media/media_files/2025/04/09/YI3WoC5BADkIjflab4jZ.jpg)
Ashwini Vaishnaw
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. మొత్తం 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్రం ఆమెదం తెలిపిందని చెప్పారు.
Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
'' ఈ ప్రాజెక్టు వల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 35 లక్షల పనిదినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని'' అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw @PIB_India https://t.co/T3GJNftW5i
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 9, 2025
Also read: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు
మరోవైపు PMKSYలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ స్కీమ్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి కూడా కమాండ్ ఏరియా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది.
Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq
— ANI (@ANI) April 9, 2025
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
bjp | telugu-news | ashwini-vaishnaw | andhra-pradesh