Vande Bharat: కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాదికి మరో 12 వందేభారత్‌ రైళ్లు

కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా రైలు కోల్‌కతా-గుహవాటి మధ్య అందుబాటులోకి రానుందని తెలిపారు.

New Update
PM Modi to launch first Vande Bharat sleeper this month

PM Modi to launch first Vande Bharat sleeper this month

కేంద్ర రైల్వేశాఖ(sounth-central-railway) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్‌ రైళ్లు(vande-bharat-sleeper) అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(ashwini-vaishnaw) ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా రైలు కోల్‌కతా-గుహవాటి మధ్య అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ రైలు జనవరి 18 లేదా 19న ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌-అస్సాం మధ్య నడిచే ఈ రైలులో టికెట్‌ ధరలు.. విమాన టికెట్ల కన్నా తక్కువే ఉంటాయని చెప్పారు.

Also Read: సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?

PM Modi To Launch First Vande Bharat Sleeper

ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం విమాన ప్రయాణానికి రూ.6 వేల నుంచి రూ.8వేలు ఖర్చవుతుందని అన్నారు. వందేభారత్‌లోని స్లీపర్‌ థర్డ్‌ ఏసీలో టికెట్ ధర రూ.2300 ఉన్నట్లు చెప్పారు. సెకండ్ ఏసీలో దాదాపు రూ.3వేలు, ఏసీ ఫస్ట్‌ క్లాస్‌లో రూ.3600 ఉంటుందని తెలిపారు. మిడిల్‌ క్లాస్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. 6 నెలల్లో 8 రైళ్లు రెడీ అవుతాయని చెప్పింది. 

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

ఈ ఏడాదిలో మొత్తంగా 12 రైళ్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 11 థర్డ్‌ ఏసీ, నాలుగు సెకండ్‌ ఏసీ, ఒకటి ఫస్ట్‌ ఏసీ పెట్టలుండే ఈ రైల్లో 828 మంది ప్రయాణం చేయవచ్చు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లేందుకు ఈ రైలును తయారుచేశారు. కానీ ప్రస్తుతం ఈ రైలును 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తారని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు