/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
రెండు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇక మిగతా జిల్లాలు అయిన అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ఉండటంతో లొతట్టు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Telangana HC : తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
During next 3 hours, entire Central AP to see rains as the rains reaching close to our coast. Districts like Krishna, West Godavari, Konaseema, #Kakinada, Eluru, NTR (Including #Vijayawada) and #Guntur can see Light to Moderate rains with heavy rains at some parts.
— Andhra Pradesh Weatherman (@praneethweather) October 14, 2025
One or two… pic.twitter.com/odNvucKq6X
తెలంగాణాలో ఈ జిల్లాలో..
తెలంగాణలో హన్మకొండ, వరంగల్, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Today's FORECAST ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) October 14, 2025
HEAVY THUNDERSTORMS ALERT ⚠️
Scattered SEVERE THUNDERSTORMS ahead in Central, South TG districts like Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Yadadri - Bhongir, Rangareddy, Vikarabad, Mahabubnagar, Wanaparthy, Nagarkurnool, Bhadradri - Kothagudem,…
ఇది కూడా చూడండి: Telangana News: ప్రభుత్వానికి షాక్..తెలంగాణ ద్రవ్యోల్బణం ఢమాల్