Montha Effect: మొంథా తుఫాను ఎఫెక్ట్..కోతకు గురైన శ్రీశైలం జాతీయ రహదారి
మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది.
మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తుఫాన్ బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు.
మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది.వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పొరుగు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.
మొంథా తుఫాన్ ప్రభావం & క్షేత్రస్థాయి పరిస్థితులపై ముంబాయి నుంచి ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆర్ అండ్ బి శాఖ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ ఈలకు ఆదేశాలను జారీ చేశారు.