/rtv/media/media_files/2025/10/29/the-looming-threat-of-flooding-2025-10-29-11-53-23.jpg)
The looming threat of flooding
Flash flood : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పొరుగు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల కొంతభాగంలోతక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం (తక్షణ వరద ముప్పు) ఉండే అవకాశం ఉందని తెలిపింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/29/rain1a-1-2025-10-29-11-48-06.webp)
ఐఎండీ ప్రకారం..ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం,గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వరద పొంచి ఉంది. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజి గిరి, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
వీటితో పాటు మరాఠవాడా సమీప ప్రాంతాలు: నాందేడ్, హింగోలి, పర్బణీ ప్రాంతాలు, విదర్భా ప్రాంతం (మహారాష్ట్ర): బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగ్పూర్ జిల్లాలు వరద ముప్పుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఎత్తు ప్రాంతాలు, నీరు నిలిచే భూములులో జలమునుగులు (inundation), నీటి నిల్వ, రహదారులపై నీరు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తదుపరి 6 గంటల్లో తీర ఆంధ్రప్రదేశ్‌లో, తదుపరి 24 గంటల్లో తెలంగాణ, విదర్భా, మరాఠవాడాలో తీవ్ర వర్షపాతం వల్ల నీరు నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: తుఫాన్ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!
ప్రజలకు సూచనలు: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దు. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోండి. రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది.అత్యవసర పరిస్థితుల్లో మీ జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వండి.IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నుంచి జారీ అయ్యే తాజా సమాచారం పాటించాలని సూచించింది.
కాగా, తెలంగాణ, ఏపీపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుంది.ప్రస్తుతం నర్సాపూర్‌కు వాయువ్యంగా 80 కి.మీటర్లు.. కాకినాడకు పశ్చిమాన 100 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఏపీ, తెలంగాణ మీదుగా కదులుతున్న తుఫాన్ రాబోయే 3 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.తర్వాత 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Pak Minister: భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మ.. మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ మంత్రి
Follow Us