Montha Effect: మొంథా తుఫాను ఎఫెక్ట్..కోతకు గురైన శ్రీశైలం జాతీయ రహదారి

మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది. 

New Update
srisailam

రెండు రోజుల పాటూ ఆంధ్రప్రదేశ్ లో వర్సాలు దంచికొట్టాయి. మొంథా తుఫాను తన ప్రభావం చాలా భారీగానే చూపించింది. దీని కారణంగా దాదాపు రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడ్డాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి..విద్యుత్ అంతరాయం కలిగింది. రోడ్ల జలమయంగా మారాయి. వాగులు, వంకలూ పొంగపొర్లాయి. ఈ క్రమంలో నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం లతిపూర్ సమీపంలో డిండి జలాశయం మత్తడి కూడా  పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీని కారణంగా జలాశయం పక్కనే ఉన్న జాతీయ రహదారి కోతకు గురైంది. 

దారి మళ్ళింపు..

హైవేకు కోతకు గురవ్వడమే కాక..డిండి జలాశయం రోడ్డు మీదకు కూడా వచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం నుంచి అధికారులు రాకపోకలను నిలిపేశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లించారు. కోతకు గురైన రమదారిని అధికారులు సమీక్షించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధికారులు సమాచారం అందించారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి వెయ్యి రూపాయిల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కుటుంబంలో ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు సాయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

Advertisment
తాజా కథనాలు