/rtv/media/media_files/2025/10/28/montha-cyclone-2025-10-28-09-28-09.jpg)
మొంథా.. ప్రస్తుతం ఈ పేరే ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను వణికిస్తోంది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం.. తీవ్రంగా బలపడి మరికొన్ని గంటల్లో కాకినాడ వద్ద తీరం దాటాల్సి ఉంది. అనుహ్యంగా మొంథా తుపాను తీరం దాటే దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం లేదా అమలాపురం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. రాబోయే మూడు, నాలుగు గంటలు అత్యంత కీలకమని ఃఅధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం దాటడానికి ఆరు గంటలు పట్టే ఛాన్స్ ఉంది. మొంథా తుపాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆర్ & బీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు..
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలోని అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులు..అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం & క్షేత్రస్థాయి పరిస్థితులపై ముంబాయి నుంచి ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆర్ అండ్ బి శాఖ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ ఈలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసుకుని, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆర్ & బీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కుదుటపడేవరకు అధికారులు 24x7 అందుబాటులో ఉండాలని కూడా మంత్రి ఆదేశించారు.
ఇవాళ రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు.
— SV6 NEWS (@Sv6News) October 28, 2025
తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న చంద్రబాబు.
మొంథా తుఫాన్‌పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచనలు.
ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.#Montha#Amaravati#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/PeS37sIZZl
1632 కి.మీ మేర రహదారులు ధ్వంసం..
మొంథా తుఫాన్ కారణంగా ఈ రోజు సాయంత్రం నాటికి దాదాపుగా 1632 కి.మీ మేర రహదారులు ధ్వంసం అయ్యాయని ఆర్ & బీ శాఖ చెబుతోంది. మొత్తం 69 చోట్ల రహదారులు గుంతలు, గోతులతో దెబ్బ తినగా.. ఇప్పటి వరకు 16 చోట్ల పునరుద్దరణ చేశామని లెక్కలు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల రహదారులు కోతకు గురికాగా, 6 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టి, ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చేశారు. మొత్తంగా కల్వర్టులు దాదాపు 144 చోట్ల ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు 36 చోట్ల పునరుద్ధరించారు. భారీ వర్షాలకు తోడు, తీవ్ర గాలివానతో రహదారులపై 66 చోట్ల వృక్షాలు నేలకొరగగా, 62 చెట్లను ఇప్పటికే ఆర్ & బీ శాఖ క్లియర్ చేసిందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలతో దాదాపుగా 130 చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అలాగే 92 చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా.. ఇప్పటి వరకు దాదాపు 21 చోట్ల ట్రాఫిక్ ను కంట్రోల్ చేయగలిగారు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
— SV6 NEWS (@Sv6News) October 28, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా - సిమిడపల్లి మధ్యలో జరిగిన ఘటన
కుండపోత వర్షాలు కురవడంతో.. ఆ ప్రాంతంలో విరిగిపడిన కొండచరియలు
ఈ దెబ్బకు వంద మీటర్ల మేర దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలు నిలిపివేత
టన్నెల్స్ వద్ద… pic.twitter.com/IUbXNSotnq
మొత్తంగా మొంథా తుఫాను కారణంగా ఇప్పటి వరకు ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్దరణకు రూ. 98.71 కోట్లు అవసరమని ఆర్ & బీ శాఖ అంచనా వేస్తోంది. శాశ్వతంగా ఆయా రహదారుల పునరుద్ధరణకు దాదాపు రూ. 897.38 కోట్లు అవసరమని.. రాష్ట్రంలో తాత్కాలిక, శాశ్వత రహదారుల పునరుద్ధరణకు మొత్తంగా రూ. 981.91 కోట్లు అవసరమవుతుందని ఆర్ & బీ శాఖ తెలిపింది.
Follow Us