AP Crime: కాకినాడ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.. ఐదు నెలల చిన్నారి బలి
కాకినాడ జిల్లా పిఠాపురంలోని జగ్గయ్య చెరువు కాలనీలో మానవత్వాన్ని మరిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని క్షుద్ర పూజల కోసం బలిచ్చారు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు.