AP News: ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్‌ మీడియాలో దృశ్యాలు వైరల్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

New Update

AP Crime: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. గురువారం సాయంత్రం వారి అసభ్య ప్రవర్తనతో ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల ఈ యువకులు అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు ఉపయోగించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి బస్సు దిగి వారిని ప్రశ్నించగా, యువకులు చెడు భావించి ఆయనపైనే దాడికి దిగారు. ఆయనను చుట్టుముట్టి కొట్టేందుకు ప్రయత్నించడం, మాటలతో అవమానించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

గంజాయి మత్తులో యువకుల వీరంగం:

ఇంతలో బస్సు వెళ్లిపోవడంతో వీరు బస్సును వెంటాడుతూ వెకిలి చేష్టలు చేయడం, గాలిలో గంతులేసి డ్యాన్స్‌లతో వీధి మధ్య హల్‌చల్‌ చేయడం అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వీరంగం చూసిన పలు వాహనదారులు షాక్‌కు లోనయ్యారు. మద్యం మత్తులో ఉన్న వీరు తామేం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిజాలేంటి?

ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భద్రతా పరంగా ప్రజలకు భయం కలిగించే విధంగా వ్యవహరించిన వారి ప్రవర్తనను తేలికగా తీసుకోబోమని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్పష్టం చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. భద్రతకు భంగం కలిగించే ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమవరం వాసులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. యువతలో పెరిగిపోతున్న మత్తు వ్యసనాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: తెల్ల బెర్రీలు డయాబెటిస్‌తోపాటు అనేక వ్యాధులను దూరం చేస్తాయి..!

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | Latest News AP News)

Advertisment
Advertisment
తాజా కథనాలు