/rtv/media/media_files/2025/07/21/ap-free-bus-scheme-2025-07-21-18-33-35.jpg)
AP Free Bus Scheme
ఏపీలో మరో కీలక పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శ్రీకారం చుట్టారు.ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. విజయవాడ సిటీబస్ టెర్నినల్ వద్ద స్త్రీ శక్తి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు.
ఉండవల్లి నుంచి బస్సులో చంద్రబాబు, పవన్(Pawan Kalyan), లోకేష్(Nara Lokesh) ప్రయాణించారు. ఉండవల్లి ,తాడేపల్లి ప్యాలెస్, కనకదుర్గ వారధి మీదుగావారు బస్సులో ప్రయాణీంచారు. మహిళలతో కలిసి చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రయాణించారు. మహిళలతో కలిసి నెహ్రూ బస్టాండ్ వరకు బస్సులో నేతుల ప్రయాణం చేశారు.కాగా సీఎం కు కృతజ్ఞతలు తెలపడానికి భారీగా మహిళలు తరలివచ్చారు. అడుగడుగున మహిళలు మంగళహారతులతో మంగళగిరి మహిళలు స్వాగతం పలికారు.
Also Read : ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. నిద్రమాత్రలిచ్చి.. అతికిరాతంగా గొంతు నులిమి చంపిన భార్య!
Free Bus Travel Scheme In AP
అన్ని ఆర్టీసీ డిపోల్లోని ఐదు రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రం ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.ఇక అలా్ట్ర డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ బస్సులను ఉచిత ప్రయాణానికి మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్దేశిత బస్సుల్లో వెళ్లేందుకు వెసులుబాటున్నా తిరుపతి నుంచి తిరుమలకు మాత్రం ఉచిత ప్రయాణం లేనట్టే. ప్రతి డిపోలోనూ బస్సుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా సిబ్బం ది కొరత లేకుండా ఆన్ కాల్ విధానంలో డ్రైవర్లను నియమించారు. మహిళలందరితో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
Also Read : ఆర్కే బీచ్‌లో విషాదం.. అలల తాకిడికి ఓ కుటుంబం..
'స్త్రీ శక్తి' పథకం(Stree Shakti Scheme) ద్వారా ఏపీలో2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా పట్టుదలతో దీన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ పథకం ప్రవేశపెట్టడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ఏపీ వ్యాప్తంగా మహిళలు నీరాజనాలు పడుతున్నారు.
ఇది కూడా చూడండి:పులివెందుల ఎన్నికపై ఫేక్ వీడియో.. అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్?