PM to CM: సీఎం చంద్రబాబు హిందీకి ప్రధాని మోదీ ఫిదా...ఎక్స్‌లో పోస్ట్

కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు. అందుకే ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

New Update
pm-cm

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీయే విజయం సాధిస్తుందని...ప్రధాని మోదీ విజయాత్ర కొనసాగుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరజు కర్నూలులో హిందీలో ప్రసంగం అదరగొట్టారు. చంద్రబాబు హందీ ప్రసంగానికి మోదీ మురిసి పోయారు. అందుకే దీని గురించి ప్రత్యేకంగా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. చంద్రబాబు హిందీలో బాగా మాట్లాడారంటూ పొగిడారు. ఈ ప్రసంగం ద్వారా సీఎం చంద్రబాబు బిహార్‌లో ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా  ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ పట్ల తన ప్రగాఢ నిబద్ధతను ప్రదర్శించారని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు