/rtv/media/media_files/2026/02/14/budget-2026-02-14-12-03-38.jpg)
ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్(AP Budget 2026) ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Kesava) ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం కోసం రూ.2,56,143 కోట్లు కేటాయించగా, మౌలిక సదుపాయాల కల్పన, ఆస్తుల సృష్టి కోసం మూలధన వ్యయంగా రూ. 53,915 కోట్లను ప్రతిపాదించారు.
Also Read : అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. ఆయనపై మరో పీటీ వారెంట్
కేటాయింపులు..
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. అలాగే విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు ప్రకటించారు. బడ్జెట్లో అత్యధికంగా రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టుల నిర్మాణానికి రూ.13,546 కోట్లు కేేటాయించారు. అలాగే వీబీ జీ రామ్ జీకి రూ.8365 కోట్లు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖమంత్రి తెలిపారు.
విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు..
— RTV (@RTVnewsnetwork) February 14, 2026
అనంతరం తాడేపల్లిలో ఆర్ధిక మంత్రి పయ్యావుల క్యాంప్ కార్యాలయంలో ప్రతులకు పూజా కార్యక్రమం...
బడ్జెట్ ప్రతులకు పూజ నిర్వహించిన తర్వాత అసెంబ్లీకి బయలు దేరనున్న మంత్రి పయ్యావుల కేశవ్..#vijayawada… pic.twitter.com/Xd96KGQAjg
Also Read : రెండు అరటిపళ్లు తెచ్చిన గొడవ.. కాలేజీలో సీరినయర్స్, జూనియర్స్ మధ్య రాళ్ల యుద్ధం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తూ.. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లుగా ఉంటుందని, అలాగే ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తన ఆదాయ మార్గాలను పెంచుకుంటూనే, సంక్షేమ పథకాలకు ఆటంకం కలగకుండా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. అమరావతి ప్రాజెక్టులతో పాటు ఇతర కీలక ప్రాధాన్యతలకు ఈ బడ్జెట్లో తగిన ప్రాముఖ్యతనిచ్చారు. - ap cm chandra babu naidu
Follow Us