AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..!
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
AP: చంద్రబాబపై జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నారు. 'నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?', నీపై 420కేసు ఎందుకు పెట్టకూడదు.' అని చంద్రబాబును నిలదీశారు.
లేడీ అఘోరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పలు ఆలయాలను సందర్శిస్తుంది. ఇటీవలే శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న అఘోరి ఇప్పుడు యాగంటి క్షేత్రానికి బయల్దేరింది. తన కారు మొరాయించడంతో కాలినడకన వెళ్తుంది. ఆమెకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మద్యం విషయంలో కూడా ఎవరూ వేలు పెట్టకూడదంటూ హెచ్చరించారు.
అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీకవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదని..చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది.
ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.
మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.