Ap: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వాతావరణం పొడిగా ఉంటుందని చెబుతున్నారు. By Bhavana 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Weather Updates: ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయి. ఈ అల్పపీడనం ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని అధికారులు అనుకుంటున్నారు. Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. వచ్చే 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలుండగా..ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ వివరించింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత కూడా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో మంచు కూడా కురుస్తోంది. Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మరోవైదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే ఐదు రోజుల్లో తూర్పు, పశ్చిమ, వాయువ్య, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని అధికారులు పేర్కొన్నారు. Also Read: 900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇవాళ ఉదయం ఢిల్లీ, చండీగడ్ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్‌లో దట్టమైన పొగమంచు కప్పేసింది. నవంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోంతో పాటుగా మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో పొగమంచు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. Also Read: AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఎన్‌సీఆర్‌లో చలి పంజా విసురుతోంది. దీంతో ఢిల్లీ వాసులకు ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ప్రభావం కనపడుతుంది. అంతేకాదు పర్వత ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుంది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 18 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. #andhrapradesh #weather-updates #ap-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి