BIG BREAKING: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

సంక్రాంతి పండుగ వేళ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు.

New Update
Chandra babu Naidu

Chandra babu Naidu

సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సొంతూర్లకు వెళ్లడంతో తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు.అలాగే ఆయా బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు కూడా చేయాలని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.వీటివల్ల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రజలకు కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. 

Also Read: లిక్కర్‌ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు బస్సులు, అలాగే స్కూల్‌ బస్సులను కూడా వినియోగించి పట్టణాలు, గ్రామాలకు అదనపు ట్రిప్పులు నడపాలని సూచించారు. సొంతూరికి చేరుకునేందుకు ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. 

Also Read: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!

ఇదిలాఉండగా ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, అనంతపురం తదితర నగరాల్లో ఆర్టీసీ బస్‌స్టాండ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. పట్టణాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యేందుకు లక్షలాది మంది వస్తున్నారు. దీంతో అదనపు బస్సులు వేసినా కూడా అవి సరిపోవడం లేదు. ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు, సాధారణ సర్వీసులు నడుస్తున్నా కూడా ఇంకా రద్దీ కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రత్యమ్నాయంగా సీఎం చంద్రబాబు అధికారులకు స్కూళ్లు, కాలేజీల బస్సులు కూడా ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు.  

Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు