/rtv/media/media_files/2025/02/04/TQ9GaLeS0ukwTGzG9nLy.jpg)
mri scan Photograph: (mri scan)
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఘోరం చోటుచేసుకుంది. ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ చనిపోయింది. ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్‌ను అమర్చారు. కొన్నిరోజులుగా ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు MRI తీయించుకోవాల్సిందిగా డాక్టర్ సూచించారు.
Also Read: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?
ఏలూరులోని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు డాక్టర్ రిఫర్ చేశారు. కనీస తనిఖీలు చేయకుండా మహిళను ఎమ్మారై మిషన్‌లోకి పంపిన సిబ్బంది.. ఆ తర్వాతనైనా ఆమెను పర్యవేక్షించకపోవడంతో రేడియేషన్ భరించలేక విలవిలలాడుతూ చనిపోయింది. భార్య విలవిలాడుతున్న విషయం ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా సిబ్బంది స్కానింగ్‌ను ఆపలేదు. దాంతో సదరు మహిళ భర్త కళ్లముందే ప్రాణాలు వదిలేసింది.
Also Read: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు
డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది స్కానింగ్‌కు ముందు మెటల్ డిటెక్టర్‌తో మహిళను తనిఖీ చేయకుండానే మిషన్‌లోకి పంపించారు. మిషన్‌లోకి వెళ్లిన వెంటనే పేస్ మేకర్ కారణంగా ఆమె రేడియేషన్ తట్టుకోలేకపోయింది. చివరకు రేడియేషన్ ప్రభావంతో స్కానింగ్ మిషన్‌లోనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అతని భార్య చనిపోయిందని కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నొస్టిక్ సెంటర్ ముందు బాధితురాలి భర్త ఆందోళనకు దిగారు.