డేంజర్ జోన్లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు
దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరీ దిగజారిపోతోంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో స్టేజ్–4 కింద మరిన్ని నిబంధనలను రేపు ఉదయం 8గంటల నుంచి అమలు చేయనున్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. అలాగే ఆరవ తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు.
శీతాకాలంలో అనేక కారణాల వల్ల పరిసర ప్రాంతాలలో గాలి చాలా విషపూరితంగా మారుతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల గాలి నాణ్యత ఊపిరితిత్తులు, చర్మం, మెదడు, కళ్లతో సహా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్లకు చికాకు తగ్గాలంటే రక్షిత అద్దాలు పెట్టుకోవాలి.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది.
ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు.